పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
అక్షర కిరణం, (విజయనగరం): ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం దర్శించుకున్నారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్‌గజపతి రాజు అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటెండెంట్ వైవీ రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.