గాంధీజీకి మార్గం ఆదర్శనీయం
మేయర్ గొలగాని
గాంధీజీకి వైసీపీ నేతల నివాళి
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశానికి అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సాధించారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. బుధవారం ఆమె అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎండాడ వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి గుడి వాడ అమర్నాథ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ నాయకులు శ్రీవత్స పలువురు కార్పొరేటర్లు మహాత్మా గాంధీ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సత్యాగ్రహం సహాయం నిరాకరణ తదితర మార్గాలతో భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి న మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు.