21వ వార్డులో జీవీఎంసీ కమిషనర్ పర్యటన
అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖ నగర పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన 3వ జోన్ 21వ వార్డు చిన్న వాల్తేరు లోని మసీదు వీధి, విజయనగర్ కాలనీ, నేతాజీ నగర్, కొయ్య వీధి, చిన్న వాల్తేర్ అన్న క్యాంటీన్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత కాలువలోని వ్యర్ధాల తొలగింపు మొదలైనవి ప్రతిరోజు విధిగా చేపట్టా లని అధికారులను ఆదేశించారు. 21వ వార్డులో పలుచోట్ల కాలువ లలో పారుతున్న మురుగునీటిని పరిశీలించి నిత్యం కాలువలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డులోని ఉన్న పుష్‌కార్ట్‌లను పరిశీలించి వాటిని అన్నిచోట్ల వినియోగించేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్ ను ఆదేశించారు. కొయ్య వీధిలోని ప్రధాన కాలువలోని జరుగుతున్న పూడిక తీత పనులను పరిశీలించి వర్షాకాలంలో గెడ్డలు పొంగిపొరలకుండా కాలువలోని వ్యర్ధాలు లేకుండా ఎప్పటికప్పుడు పూడిక తీత పనులు చేపట్టాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్‌కు కమిషనర్ ఆదేశించారు.
మసీద్ వీధిలోని కాలువలు, రోడ్లపై భవన నిర్మాణ వ్యర్ధాలను గమనించి వాటిని యుద్ధ ప్రాతిపదికపై తొలగించాలని ప్లానింగ్ కార్యదర్శిని ఆదేశించారు. భవన నిర్మాణదారులు వారి భవనాలు పూర్తి అయ్యేవరకు ఆయా నిర్మాణాలను పూర్తిగా కప్పి ఉంచాలని, నిర్మాణ సామాగ్రిని రోడ్లపై వేయకుండా భవనాల కాంపౌండ్ వాల్ లోపల వేసేలా చర్యలు చేపట్టాలని జెడ్సీని ఆదేశించారు.
వార్డులో సోలార్ వీధిలైట్ల తో సహా మొత్తం 331 వీధిలైట్లు ఉన్నాయని వాటిలో 16 వీధిలైట్లు వెలగడం లేదని వార్డు ఇమ్యూనిటీ కార్యదర్శి కమిషనర్‌కి వివరించగా అన్ని వీధిలైట్లు వెలిగేలా నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. చిన్న వాల్తేరు లోని మెంటల్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ పరిశీ లించారు. క్యాంటీన్లో పరిశుభ్రతతోపాటు వేడివేడిగా ఆహారాలను అందించాల న్నారు. వాష్ బేసిన్లు, టాయిలెట్లు, పరిసరాల పరిశుభ్రత, టోకెన్ సిస్టం, వడ్డింపులను పరిశీలించారు. క్యాంటీన్లోని విధులు నిర్వ హిస్తున్న వారి కి సకాలంలో జీతాలు అందుతున్నాయా అని అడిగి తెలు సుకున్నారు. పర్యటనలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్, ఏఎమ్ఓహెచ్ బి.ప్రసాద్‌రావు, కార్యనిర్వహక ఇంజ నీరు గంగాధర్, సుధాకర్, పద్మావతి, ఉప కార్యనిర్వహక ఇంజనీరు వెల్సన్, ఏపీడి రాము, శానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.