వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహిళల సౌకర్యార్థం నగరంలో మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ఈ పనులను పూర్తి చేయా లని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, కార్యనిర్వాహక ఇంజినీరు దిలీప్‌తో కలిసి మధుర వాడలో నిర్మాణంలో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించి, నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, మౌలిక సదుపా యాలు మొదలైనవాటిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత, సంక్షేమం కొరకు అత్యం త ప్రాధాన్యత ఇస్తున్నా యన్నారు. విశాఖ నగరంలోని మధుర వాడ, ముడసర్లోవ, గాజువాక ప్రాంతాల్లో మొత్తం 1124 మంది మహిళా ఉద్యోగు లు నివసించేందుకు రూ.119 కోట్లతో మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మధురవాడ జోన్లో నిర్మిస్తున్న హాస్టల్ రూ.34 కోట్లతో 5 ఫ్లోర్లతో నిర్మిస్తున్న భవనంలో 104 గదులు ఏర్పాటు చేసి 280 మంది మహిళా ఉద్యోగులు నివసించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. తాగునీరు, విద్యుత్, లిఫ్టులు, అగ్నిమాపక భద్రత, పారిశుద్ధ్య వ్యవస్థ, భోజనశాల, వినోదం, భద్రతా పర్య వేక్షణ, లైబ్రరీ, టాయిలెట్లు, ఇండోర్ గేమ్స్, ఓపెన్ స్పేస్ వంటి అన్ని సౌకర్యాలను ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 17 శాతం పనులు పూర్తయ్యాయని కార్యనిర్వాహక ఇంజనీరు దిలీప్ తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, స్మార్ట్ సిటీ సీఈఓ ఆనంద్, ఇంజినీరింగ్ అధికారులు, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.