ఆగస్టు 31 నాటికి 50 శాతం ఆస్తిపన్ను వసూలే లక్ష్యం
కవీడియోకాన్ఫరెన్స్లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆగస్టు 31వ తేదీ నాటికి 50 శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో పాల్గొన్న అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, డీసీిఆర్ ఎస్.శ్రీనివాసరావు, అన్ని జోన్ల రెవెన్యూ ఆఫీసర్లు, ఆర్ఐల తోపాటు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించారు. కమిషనర్ మాట్లాడు తూ గత సమీక్షలో నిర్దేశించిన ఆస్తి పన్నుల వసూళ్ల టార్గెట్ను ఎంతవరకు పూర్తి చేశారని ఆరా తీశారు. విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ పలు అభివృద్ధి కార్యక్రమా లను చేపడుతున్న నేపథ్యంలో జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టిని మెరుగుపరుచుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఆగస్టు 31వ తేదీ నాటికి 50 శాతం ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు, వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులు పనిచేయాలని ఆదేశించారు. కొత్త, పాత బిల్డింగ్ యొక్క కొలతలు సరి చూడాలని దానితోపాటే తాగునీటి కనెక్షన్ ఉంటే వారి ఆస్తి పన్నుతోపాటు నీటి పన్ను చార్జీలు చెల్లిస్తున్నది లేనిది పరిశీలించాలని, ఈ ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న వార్డ్ సచివాలయాలలో కంప్యూటర్లు మరమ్మతులు చేపట్టేం దుకు, అవసరమైన స్టేషనరీ కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ డీవీ.రమణమూర్తి, ఐటీ విభాగపు కార్యనిర్వహక ఇంజనీరు యు.ఎన్.నర్సింగరావును కమిషనర్ ఆదేశించారు. సమీక్షలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.