గిరి ప్రదక్షిణ మార్గంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యటన
Åస్నానపు షవర్ల ఏర్పాటుపై భక్తుల ప్రశంసలు Åగిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అద్భుతమని సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జీవీఎంసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించామని, త్రాగునీటి కేంద్రా లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, స్నానానికి ప్రత్యేక షవర్లు, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపు వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తుల నుంచి మంచి స్పందన, ప్రశంసలు లభించాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొ న్నారు. మంగళవారం ఆయన వెంకోజిపాలెం జంక్షన్ నుండి సీతమ్మధార, నరసింహ నగర్, మాధవధార, ఎనఎస్టిఎల్ వంటిల్లు జంక్షన్ నుంచి గోపాలపట్నం కుమారి కళ్యాణమండపం, పాత గోశాల, సింహాచలం వద్ద తొలి పావంచ వరకు గిరి ప్రదక్షిణ రోడ్డు ను, సింహాచలం వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అధికారులతో కలిసి పర్యటిస్తూ ఏర్పాటులను పరిశీలించారు.
జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ స్వయంగా గిరిప్రదక్షిణ మార్గా న్ని పూర్తిగా పరిశీలిస్తూ ప్రతి పాయింట్‌ను సందర్శించినట్టు తెలి పారు. మార్గమధ్యంలో భక్తులతో నేరుగా మాట్లాడి వారికి అందు తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని, షవర్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు, పారి శుద్ధ్య నిర్వహణ చాలా బాగుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది కల్పించిన సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో దాతలు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కేంద్రాలను కమిషనర్ పరిశీలిస్తూ, ప్రసాదం స్వీక రించిన అనంతరం ఉపయో గించిన ప్లేట్లు, గ్లాసులు, ఇతర వ్యర్థా లను తప్పనిసరిగా డస్ట్బిన్లలో వేయాలని, ప్లాస్టిక్ వస్తువులు విని యోగించరాదని భక్తులకు అవగాహన కల్పించాలని నిర్వాహకుల కు సూచించారు. అనంతరం సింహాచలం తొలి పావంచ సమీపం లోని పుష్కరిణి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్, కంట్రోల్ సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె.వెంకట్రావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి పరిశీలించారు. అక్కడి నుంచి భక్తుల రాకపోకలను పర్యవేక్షిస్తూ, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని కమాండ్, కంట్రోల్ సెంటర్లో విధు లు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రతి భక్తికి అవసరమైన అన్ని సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా జీవీఎంసీ అధికారులు, సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని కమిషనర్ తెలిపారు. భక్తులు కూడా పరిశుభ్రతను కాపాడుతూ జీవీఎంసీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను వినియోగించి, ప్లాస్టిక్ రహిత గిరి ప్రదక్షిణ నిర్వ హణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.