ఇకపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీన డబ్బులు జమ
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచఎస్) కింద వారి నుంచి సేకరించే నెలవారీ డబ్బుల్ని, ప్రభుత్వ వాటాను నిర్ణీత సమయంలోగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు అకౌంట్‌కు నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశిం చింది. ఈనెల 5న ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్యోగ సంఘాల నేతలు కలిసిన సమయంలో ఈ సమస్యను వివ రించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబం ధించిన వైద్య సేవలపై ఊరట దక్కింది. ప్రతినెలా 1వ తేదీ న ఈహెచఎస్ (ఎంప్లాsTÖస్ హెల్త్ స్కీమ్) కింద నిధుల ను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు జమ చేయాలని నిర్ణయిం చారు. ఈమేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈహెచఎస్ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు 50శాతం భరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 50శాతం ట్రస్టుకు చెల్లించాలి. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలయ్యేలా చూస్తారు. ఈకొత్త విధానంతో ఈహెచఎస్ క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆలస్యం కాకుండా.. ఆస్పత్రులకు సకాలంలో నిధులు అందుతా యంటున్నారు.
ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు.. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల నుంచి మినహాయించే నెలవారీ వాటా డబ్బులు 50శాతం, ఇటు ప్రభుత్వం నుంచి వాటాగా ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు 50శాతం నేరుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు బ్యాంకు అకౌంట్‌కు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ జమ చేస్తారు. ఇకపై ప్రతి నెలా 1వ తేదీన జీతాలు, పెన్షన్ల నుంచి హెల్త్ స్కీమ్ డబ్బులు అదే రోజున ట్రస్టు అకౌంట్‌కు బదిలీ చేస్తారు. ఈ ఆదేశాలు అమలు చేసేలా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈవోతో ట్రెజరీస్, అకౌంట్స్ డైరెక్టర్ సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈనెల 5న ఉద్యోగ సంఘాల నేతలతో చంద్రబాబు సమా వేశమైన సమయంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈహెచఎస్కు సంబంధించి తమ జీతాల నుంచి డబ్బులు జమ అవుతున్నా ఎప్పటికప్పుడు ట్రస్టుకు ఆ నిధుల్ని చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కారణంగా తాము వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ప్రతి నెలా 1న ట్రస్టుకు నిధులు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈహెచఎస్ వాటాలు నేరుగా ట్రస్ట్‌కు బదిలీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.