14న జూలో పన్నేండేళ్లలోపు బాలలకు ఉచిత ప్రవేశం
îజూ క్యూరేటర్ మంగమ్మ
అక్షరకిరణం, (విశాఖపట్నం): ఈనెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (జూ) చిన్నారులకు ప్రత్యేక కానుక ప్రకటించింది. ఈనెల 14వ తేదీన 12 సంవత్సరాల లోపు పిల్లలందరికీ జూ పార్కులో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. చిన్నారులకు ప్రకృతి, వన్యప్రాణులపై అవగాహన కల్పిం# áడంతో పాటు, జంతువుల జీవన విధానం, సహజ ఆవాసా లు, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రత్యక్షంగా తెలుసు కునే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. జూ సందర్శనతో వివిధ రకాల వన్యప్రాణులను వీక్షిస్తూ జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై చిన్నారుల్లో అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాలల దినోత్స వాన్ని ప్రకృతి, వన్యప్రాణుల మధ్య ఆనందంగా చేసుకోవాలని జూ క్యూరేటర్ మంగమ్మ కోరారు.