దసరాకు అందరికీ బెజవాడ దుర్గమ్మ ఉచిత దర్శనం..
Åరూ.100, రూ.300, రూ.500 టికెట్లన్నీ రద్దు
అక్షర కిరణం, (విజయవాడ): విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఏడాది భక్తులు భారీగా తరలివస్తా రని అంచనా వేస్తున్న అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. దసరా సమయంలో ఇంద్రకీలాద్రిపై రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ భక్తుల క్యూలైన్లకు ఎక్కడా సిఫార్సుల దర్శనాలతో ఇబ్బంది రాకుండా ప్లాన్ చేశారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రస్తుతం ఉన్న రూ.100, రూ.300, రూ.500 టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన లైన్లుగానే ఉంటాయంటున్నారు.
దసరా సమయంలో వీఐపీలు, ప్రత్యేకంగా దర్శనం చేసుకో వాలనుకునేవారికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. భవనానీ ప్రత్యేక దర్శనం పేరుతో టికెట్ ధర రూ.1000గా నిర్ణయించారు. కానీ ఈ స్పెషల్ టికెట్లు అందరికీ అందుబాటు లో ఇవ్వరు. కేవలం ప్రత్యేకంగా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికా రులు, అధికారిక సిఫార్సులపై వచ్చే భక్తులకు ఈ టికెట్లు కేటా యిస్తారు. ఇలా చేస్తే సిఫార్సుల ఒత్తిడి తగ్గుతుందంటున్నారు అధికారులు. భవానీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు జారీ చేసేందుకు ఇంద్రకీలాద్రి సమీపంలో ఉన్న కుమ్మరిపాలెం దగ్గర టీటీడీ స్థలంలో ఏర్పాట్లు చేస్తు న్నారు అధికారులు. ఈ టీటీడీ స్థలాన్ని హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం కేటాయించారు.
విజయవాడ వైపు నుంచి వచ్చేవారికి కాళేశ్వరరావు మార్కెట్, స్వరాజ్య మైదానం దగ్గర ఈ భవానీ ప్రత్యేక దర్శనం టికెట్ జారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడకు వచ్చిన వారు రూ.1000 టికెట్ తీసుకోవాలి.. అనంతరం వీరిని ప్రత్యేక వాహనాల్లో ఇంద్రకీలాద్రికి తరలిస్తారు. ఈ భవానీ ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేసి.. నేరుగా అంతరాలయ దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రత్యేక దర్శనాలను రోజులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రెండు గంటల చొప్పున మొత్తం ఆరు గంటలు అనుమతిస్తారు. ఏ సమయంలో టికెట్లు ఇవ్వాలనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక సాధారణ భక్తులకు 5 క్యూ లైన్లతో దర్శనం కల్పిస్తారు. బంగారు వాకిలి దర్శనం, రూ.300, రూ.100 లైన్లు కలిపి దర్శనం చేసుకుంటారు. ఒకవైపు వినాయక ఆలయం, మరోవైపు కుమ్మరిపాలెం నుంచి భక్తులు 5 క్యూలైన్లలో దర్శనాలకు వస్తారు. ఘాట్ రోడ్డు నుంచి ఈ క్యూలైన్లను మూడిటిగా మారతాయి. అక్కడి నుంచి ఓం టర్నింగ్ పాయింట్ నుంచి మళ్లీ 5 క్యూలైన్ల ద్వారా దర్శనం కోసం వెళ్లేలా ప్లాన్ చేశారు. మొత్తం మీద విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.