శ్రీరామనవమిలో అన్న ప్రసాదానికి నాలుగు రైస్ బ్యాగులు పంపిణీ
అక్షర కిరణం (విశాఖపట్నం సిటీ): తొమ్మిది నుంచి 13 వార్డులో పరిధిలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే వారికి వి జ్యూయలరీ మార్ట్ సహకారంతో, శ్రీరాముల దేముడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు రైస్ బ్యాగులు ఉచితంగా ఇస్తామని ట్రస్ట్ అధినేత కాకి గంగరాజు (క్యాటరింగ్ రాజు) ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేవారు అన్నప్రసాద విత రణ కోసం తమను సంప్రదిస్తే ఉచితంగా నాలుగు రైస్ బ్యాగులు అందిస్తామని తెలిపారు. సీతారాముల కళ్యాణం నిర్వహించేవారు ఉత్సవాలకు సంబంధించిన కరపత్రం లేదా ఆహ్వాన పత్రం చూపిస్తే చాలని, రైస్ బ్యాగ్‌లు అంది స్తామని చెప్పారు. తమ ట్రస్ట్ తరఫున అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని ఇటీవల రంజాన్ సందర్భంగా ముస్లింలకు పండ్లు అందించామని కేటరింగ్ రాజు తెలి పారు. తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు వార్డుల పరిధిలో తామే రైస్ బ్యాగ్‌లను రామాలయం లేదా సీతారాముల కళ్యాణం నిర్వహించే వేదిక వద్దకు తీసుకు వచ్చి అందిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 95505 78107లో సంప్రదించాలని కోరారు.