వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎంజీఆర్ విరాళం
అక్షర కిరణం, (పాతపట్నం): శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) పాల్గొన్నారు. వేెంకటేశ్వర స్వామి ఆలయానికి 20,000 రూపాయలు విరాళం అందజేశారు. కొత్తూరు మండలం నేరడి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అనంతరం పునర్నిర్మాణా నికి ఇరవై వేల రూపాయలను కమిటీ సభ్యులకు విరాళం గా అందజేశారు. అయన మాట్లాడుతూ ఏ గ్రామంలోనైనా ఆలయాలు నిర్మించాలన్న సంకల్పం ప్రజలకు ఉంటే వారి సంకల్పానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో గరుకు యతిరాజు, గరుకు శ్రీనివాస్ అగు తుమూడి మాధవరావు, కమలకరరావు, దశరదరావు, ప్రభాకర్, రఘు, కోయిలపు సంజీవరావు, గవర తిరుపతి రావు, గ్రామస్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.