52వ వార్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలి
`ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ కమిషనర్, జోన్`5 జెడ్సీలకు టీడీపీ నాయకుల వినతి
అక్షర కిరణం, (విశాఖపట్నం/మర్రిపాలెం): జీవీఎంసీ 52వ వార్డులో ఫుట్‌పాత్‌ల సమస్యలపై టీడీపీ నాయకులు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే గణబాబు జీవీఎంఎంసీ కమిషనర్‌కు, జోన్`5 జోనల్ కమిషనర్‌కు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎన్ఏడీ నుంచి మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వరకు ఉన్న ఫుట్‌పాత్‌లను కొంతమంది వ్యాపారులు ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీడీపీ 52వ వార్డు ఇన్చార్జి , టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వై.తిరుమల రావు, టీడీపీ వార్డు క్లస్టర్ 10 వి.చంద్రశేఖర్‌లు ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం దీనిపై జీవీఎంసీ కమిషనర్, జోన్`5 జెడ్సీలకు వినతిపత్రం సమర్పించారు. 52వ వార్డులోని గణేష్‌నగర్ నుంచి కొత్త కరాసా వరకు వ్యాపారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించేయడంతో ప్రత్యామ్నాయంగా ఎటువంటి నడక సౌకర్యం లేకపోవడంతో సీనియర్ సిటిజన్లు, జూనియర్ స్కేటర్లు (వలంటీర్లతో), వాకర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్ఏడీ నుంచి రైల్వే క్వార్టర్స్ వరకు ఫుట్‌పాత్‌లను వ్యాపారులు ఆక్రమించడంతో నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవీఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు దీనిపై స్పందించి కనీసం ఒక వైపు (ఎడమ లేదా కుడి) అయినా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని కోరారు. కొంతమంది వ్యాపారులు నేరుగా ప్రధాన రహదారి పై దుకాణాలను ఏర్పాటు చేశారని దీని వల్ల ఈ ప్రాంతంలో రద్దీ వీపరీతంగా పెరిగిపోయి ట్రాఫిక్‌కు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయని వారు పేర్కొన్నారు. అధికారులు స్పందించిన సమస్యను పరిష్కరించాలని టీడీపీ నాయకులు తిరుమలరావు, వి.చంద్రశేఖర్ వినతిపత్రం అందజేశారు.
న్యూ కరాసలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
` 5 వేల మందికి మహా అన్నదానం
`కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్
అక్షర కిరణం, (న్యూకరాస): శరన్నవరాత్రి మహోత్సవాలు న్యూ కరాసాలో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనకు ముఖ్యఅతిథులుగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ విచ్చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. ఈసందర్భంగా
వారు మాట్లాడుతూ ఇటువంటి మహోత్సవాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావనతోపాటు సేవా తత్పరత పెంపొందుతుందన్నారు. అన్నసమారాధనల వల్ల నిరు పేదల ఆకలి తీరుతుందన్నారు. ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అన్నదానం వంటి ఉత్తమ సేవలు చేయడం అభినందనీయం అన్నారు. ఈ మహా అన్నదానంలో న్యూకరాసా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మంది భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.