వరద బాధితులకు ఏపీఎస్‌ఈబీఈఏ, ఈపీడీసీఎల్ నిత్యావసర వస్తువుల పంపిణీ
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఏపీఎస్‌ఈబీఈఏ ఈపీడీసీఎల్ వైజాగ్ విజయనగరం శాఖ ఇంజనీర్లు విజయవాడ వరద బాధిత నిరుపేద ప్రజలకు చేయూత నిచ్చారు. విజయవాడ 45వ వార్డులోని భగత్‌సింగ్ నగర్లో 140 ప్యాకెట్లు బియ్యం, నూనె, పప్పు, చింతపండు, ఉప్పు, చక్కెర, బిస్కెట్లు తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఏపీ జెన్కో సీఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు జేఎండీ హెచ్ఆర్డీ కీర్తి చేకూరి సోమవారం ఏపీఎస్‌ఈబీఈఏ ఈపీడీసీఎల్ వైజాగ్ విజయనగరం శాఖలతో విజయవాడలోని నిరుపేద వరద బాధితులకు నిత్యావసర సామగ్రిని పంపిణీ చేశారు. ఈపంపిణీలో ఈపీడీసీఎల్ కార్యదర్శి ఈఆర్ఎస్వీ హేమంత్ కుమార్, ఈఆర్ సీహెచ్ కోటేశ్వరరావు, వైజాగ్ బ్రాంచ్ సెక్రటరీ, ఈఆర్ ఏ ప్రసాద్, ఈఆర్ ఎన్ ఇమామ్ ఖాసిం, డిప్యూటీ సెక్రటరీ ఈపీడీసీఎల్, అసోసియేషన్ రాష్ట్ర సెంట్రల్ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.