ఆంధ్రప్రదేశ్లో వరద నష్టంపై ప్రభుత్వం ప్రకటన
రాష్ట్రంలో 45 మంది మృతి
1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం
78 చెరువులు, కాలువలకు గండ్లు
అక్షర కిరణం, (అమరావతి): వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా రాష్ట్రంలో మొత్తం 45 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. మొత్తం గా 1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 19,686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం ఏర్పడిర దని ప్రభుత్వం తెలిపింది. 3,913 కి.మీ మేర ఆం ్అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొంది. 558 కిలో మీటర్ల అర్బన్ రోడ్లు భారీ వర్షాల కారణంగా ధ్వంసమయ్యాయని ప్రభుత్వం ప్రకటనలో తెలియజేసింది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని వివరించింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగున్నాయని ప్రకటించింది.