వరద బాధితులకు విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ రూ.25 లక్షల విరాళం
అక్షర కిరణం, (విశాఖపట్నం): వరద బాధితులకు విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ విరాళం రూ.25 లక్షలు వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహా యనిధికి ది విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమి టెడ్ రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడ రేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుతోపాటు మరో 13 బ్యాంకులు రూ.52,90,000 సహాయంగా అందించాయి. సామాజిక బాధ్యతగా అర్బన్ బ్యాంకులు అందించిన ఈమొత్తాన్ని చెక్ రూపంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి ది విశాఖపట్నం కో ఆపరే టివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ కార్యదర్శి చలసాని రాఘ వేంద్రరావు, అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర, ఉపాధ్యక్షులు ఎస్కే.అబ్దుల్ జీలాని, ఇతర ప్రతి నిధులు అందజేశారు.14 అర్బన్ బ్యాంకులు అందజేసిన రూ.52,90,000 సహాయంలో ది విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ రూ.25,00,000 అందజేసింది.