ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు బంద్
Åభోగాపురం విమానాశ్రయంలో 17 అర్థరాత్రి నుంచి విమానాల రాకపోకలు Åకేంద్రం గెజిట్ విడుదల
అక్షర కిరణం, (ఢిల్లీ/విశాఖపట్నం): విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయం ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు. ఈ వేడు కకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ వేళ కేంద్రం భోగాపురం, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లకు సంబం ధించి కీలక ప్రకటన చేసింది. భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని కేంద్ర పౌరవిమానయానశాఖ తెలిపింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు ఉన్న ఇంటర్నేషనల్ ట్రావెల్కోడ్ ‘వీటీజెడ’ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయా నికి బదిలీ అవుతుందని కేంద్రం ఈ ప్రకటనలో తెలిపింది. ఇది కూడా ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి అమలవు తుందన్నారు.
అదే సమయంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ (ఐఎనఎస్ డేగ) సివిల్ ఎన్క్లేవ్ నుంచి 30 ఏళ్లపాటు షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు ఆగిపోతాయని ప్రకటనలో తెలిపారు. కాకపోతే ఏవైనా జాతీయ అత్యవసర పరిస్థితు లు ఎదురైతే మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని కూడా తెలిపారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, పోలీసు విమానా లు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తాయ న్నారు. నాన్‌షెడ్యూల్డ్ కమర్షియల్ కార్యకలాపాలూ కొనసాగుతా యని తెలిపారు. అంతేకాదు భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పౌరవిమానయానశాఖ మరో కీలకమైన గెజిట్ నోటి ఫికేషన్ విడుదల చేసింది. ఈఎయిర్పోర్ట్కు ‘అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేస్తున్నట్లు తెలిపింది. 2024 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్ష తన జరిగిన కేబినెట్ సమావేశంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోగా.. కేంద్రం అధికారికంగా గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇటు ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన ఏర్పాట్లపై భోగాపురం విమానాశ్రయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ సమీక్షించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభో త్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రధాని పర్యటన విజయవంతానికి ప్రతిఒక్కరూ సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలవాలన్నారు. అలాగే ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా జరపాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. వేడుకలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.