మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
అక్షర కిరణం, (విశాఖపట్నం): నగర పోలీస్ విభాగంలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తూ, గత ఏడాది నవంబర్ 25న జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన బడియా కృష్ణారావు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిం చింది. శుక్రవారం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ మృతుడి భార్య బడియా గౌరీకి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ తరపున మంజూరైన రూ.10,11,600 విలువైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు, హోం గార్డ్స్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సీహెచ్. కోటేశ్వర కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.