కాలేయ క్యాన్సర్ బాధితుడికి సీఎంఆరఎఫ్ నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
అక్షర కిరణం, (శ్రీకాకుళం): కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఓ నిరుపేద యువ కుడికి సకాలంలో వైద్య సాయం అందిం చేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విశేష చొరవ చూపారు. ఆయన అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వ కంగా కలిసి పరిస్థితిని వివరించారు. కాజీపేట పంచాయతీ పరిధిలోని ఆదిత్య నగర్ కాలానికి చెందిన పొందురు బాల మురళీకృష్ణ అనే యువకుడు అత్యవసరం గా కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్) చేయించుకోవాల్సి ఉందని, ఈ ప్రాణరక్షక చికిత్స నిమిత్తం ప్రభుత్వం తొలుత రూ.5 లక్షల సాయం మంజూరు చేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సాయం పెంచవలసిందిగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థనకు ముఖ్యమంత్రి తక్షణమే సాను కూలంగా స్పందించారు. మానవతా దృక్పథంతో బాధితుడికి అందాల్సిన సాయాన్ని మరో ఐదు లక్షలు పెంచుతూ, మొత్తంగా రూ. 10 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరు చేశారు. ఒక నిరుపేద యువకుడి ప్రాణాలను కాపాడేందుకు సత్వరమే స్పందిం చిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.