లేమర్తిలో ఫైజర్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం
అక్షర కిరణం, (లేమర్తి): ప్రముఖ బహుళజాతి ఔషధ, బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శంకర్ ఫౌండేషన్ సహకారంతో, తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా గురువారం పరవాడ మండలం లేమర్తి గ్రామంలో సమగ్ర ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ రవిచందర్ కట్టా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన పలువురు ఉన్నతాది óకారులు పాల్గొన్నారు. వారిలో రవి పోలిశెట్టి, క్వాలిటీ హెడ;్ రాజేష్ రావూరి, ఫైనాన్స్ హెడ;్ సత్జీత్ సింగ్, ఐటీ హెడ;్ ఎంవీ రామరాజు, పబ్లిక్ అఫైర్స్ హెడ్ డాక్టర్ పి. ఈశ్వర్ రావు, మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. వీరితోపాటు శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. రవిచందర్ కట్టా మాట్లాడుతూ శిబిరానికి హాజరైన లబ్ధిదా రులు ఈ కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, నివారించగల అంధత్వాన్ని అరికట్టేందుకు అందిస్తున్న సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు. సమాజానికి శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను ఆయన అభినందించారు. లేమర్తి జడ్పీహెచఎస్ హెచఎం పీవీఎస్.ఎన్. ప్రసాద్, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు శిబిరాన్ని సహకా రాన్ని అందించారు.