ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్లో కంటి పరీక్ష శిబిరం
అక్షర కిరణం, (విశాఖపట్నం): వాసన్ ఐ కేర్ హాస్పి టల్స్ విశాఖపట్నంలోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, విద్యా ర్థుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిం చారు. ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకట రమణ మార్గదర్శకత్వంలో ఈశిబిరం నిర్వహించారు. వాసన్ ఐ కేర్ వైద్య బృందం సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించారు. అన్ని అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది శిబిరంలో చురుకుగా పాల్గొన్నారు. లెక్చరర్లు కె.శంకర్ ప్రసాద్, ఆర్. లీలా ప్రియదర్శిని పరిపాలనా బృందం నుంచి బి.వైకుంఠం వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ సేవలను ప్రిన్సిపాల్ ప్రశంసించారు.