ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
Åజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి అభిషిక్త్ కిషోర్
అక్షర కిరణం, (విశాఖపట్నం): భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులతో కలిసి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వెనుక ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో కమిషనర్ కేతన్ గార్గ్ ప్రసంగిస్తూ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. విశాఖ నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణతో పాటు ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించడంలో అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించాలని మొదటిది ఆరోగ్యాన్ని కాపాడు కోవడం, రెండవది ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రత్యేక నైపుణ్యాన్ని నేర్చుకొని తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అని సూచిం చారు. గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా ఇదే విషయా న్ని అధికారులు, ఉద్యోగులకు సూచించానని గుర్తుచేస్తూ, తాను కూడా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా నన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఫైనాన్స్ మేనేజ్మెంట్, అకౌంట్స్‌కు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేసి అవగాహన పెంపొందించుకున్నట్లు తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు తమ విధుల కు సంబంధించిన అంశాలతోపాటు కొత్త నైపుణ్యాలను నేర్చు కుం టూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య సీజనల్ వ్యాధులపై అవగాహన, పచ్చదనం అభివృద్ధి అంశాలపై రచించిన గేయాలకు జీవీఎంసీ కే. కాలనీ హైస్కూల్ విద్యార్థినులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే జీవీఎంసీ బాల్యం విద్యా కేంద్రాల విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి, జాతీయ సమైక్యత, సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన పాట లు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. విద్యార్థుల ప్రతిభను కమిషనర్ అభినందించారు. జీవీఎంసీ బాల్యం విద్యా కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్న కమిషనర్ కేతన్ గార్గ్‌కు బాల్యం విద్యా కేంద్రాల విద్యార్థులు జ్ఞాపికను అందజేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన కమిషనర్ విద్యలో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు
అనంతరం జీవీఎంసీలో విధుల నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనబరిచి ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, నివాసిత సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, పలు బ్యాంకులు తదితరులకు ప్రశంసాపత్రాలను అందజేసి వారి సేవలను అభినందించారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు, విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.