ధాన్యం కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
కఅన్నదాతలకు శుభ వార్త చెప్పిన ప్రభుత్వం
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతుసేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ -పంట, ఈ కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతుల వివరాలను ధాన్యం కొనుగోళ్లకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుసంధానంతో ఈ - పంట, ఈ -కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.