ఆరిలోవ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో వైజాగ్ ఓపెన్ 2024
ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆప్ ఇండియా (పీజీటీఐ), విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు ‘వైజాగ్ ఓపెన్ 2024’ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఈస్ట్‌పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు తెలిపారు. ఇది రెండో ఎడిషన్ అన్నారు. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ప్రైజ్‌మనీ కోటి రూపాయలని తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు హోస్ట్ వెన్యూ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్, అసోసియేట్ పార్ట్నర్స్ గా ఆల్వార్ దాస్ గ్రూపు, ఎస్ఆర్కే ఇన్నా. విజయనగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎల్బీ వెంచర్స్ సహకారం అందిస్తున్నా రని చెప్పారు. ఈ అత్యున్నత ఈవెంట్‌కు భారతదేశంలోని ప్రఖ్యాత గోల్ఫ్ ఆటగాళ్లు రానున్నారని చెప్పారు. పదిహేను దేశాల నుంచి గోల్ఫ్ ఆటగాళ్లు వస్తున్నట్లు చెప్పారు. ఈ ఈవెంట్‌ను ప్రఖ్యాత చానళ్ళు యూరోస్పోర్ట్, ఏబీపీ ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీని ప్రపంచ వ్యాప్తంగా 30 మిలియన్ల మంది వీక్షిస్తారని అంచనా వేశారు. ఈ ఈవెంట్లో డిఫండిరగ్ చాంపియన్ శ్రీలంకకు చెందిన ఎన్.రంగరాజ, మరో ఆటగాడు ప్రభాగత, చెక్ రిపబ్లిక్కు చెందిన స్టెపాన్ దానిక్, బంగ్లాదేశ్‌కు చెందిన జమాల్ హాస్పిన్, బాదల్ పోస్సిన్, ఎండీ అక్బర్ హాస్సిన్, అండోరాకు చెందిన కెవిన్ ఎస్టీవీ రిగ్గిలీ, సాపాలకు చెందిన సుబాష్ తమాంగ్, కెనడాకు చెందిన సుబరాజ్సింగ్ గిల్, దక్షిణ కొరియాకు చెందిన సీ ఇన్ కిమ్. జపాన్‌కు చెందిన మక్కో ఇవాసాకి అమెరికాకు చెందిన డొమినిక పిక్సిరిలో ఉన్నారు. స్థానిక క్రీడాకారులు ఎస్ ముత్తు, రెహమాన్ మహబూబ్ షరిఏ, బెత్సాహికులు భరత్ కొల్లపూడి, జి. దుర్గాప్రసాద్ పాల్గోంటారన్నారు.