స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లిన్ చిట్
అక్షర కిరణం, (హైదరాబాద్): స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల మళ్లింపు అంశంలో అసలు చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఈడీ క్లారిటీ ఇచ్చింది. తాజా గా ఈ కేసులో కొన్ని సంస్థల ఆస్తుల్ని జప్తు చేస్తూ ప్రెస్ నోట్ వచ్చింది. అందులో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఏపీ లో స్కిల్ సేవలు అందించిన కంపెనీలు షెల్ కంపెనీలకు మళ్లించారని ఆస్తులు జప్తు చేశారు. ఆ షెల్ కంపెనీల్లో చంద్రబాబువి కానీ.. టీడీపీకి సంబంధించిన వారివి కానీ లేవని ఈడీ స్పష్టం చేసింది. అంటే చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది.
ఒక్క ఆధారం చూపించలేకపోయిన్ జగన్: సీఐడీ
స్కిల్ కేసులో చంద్రబాబు పేరును రాత్రికి రాత్రి చేర్చి అర్థరాత్రి కర్నూలులో అరెస్టు చేశారు. అక్కడ చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. నిధుల దుర్వినియోగం జరిగిందో.. అవినీతి జరిగిందో వాళ్లకే అర్థం కానట్లుగా కేసు కట్టారు. అంతిమంగా అప్పటి సీఐడీ చీఫ్ సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చెప్పారంటే ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. ఆ షెల్ కంపెనీలు చంద్రబాబువే అని చెప్పారు. విచారణలో ఒక్క కంపెనీని కానీ లేదా చంద్రబాబుకు ఒక్క రూపాయి చేరినట్లుగా కానీ నిరూపించలేకపోయారు. ఈ కారణంగా ఆధారాల్లేవని హైకోర్టు బెయిల్ ఇచ్చింది.