డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఘనంగా డ్రైడే` ఫ్రైడే
అక్షర కిరణం, (విశాఖపట్నం): డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వర రావు, డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కణితి ప్రాథóŠమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తిరుమల నగర్ సచివాలయం, వడ్లపూడి సందర్శించి 2 లార్వా కంటైనర్లు తనిఖీ చేశారు. ఇళ్ల లోపల, బయట కూడా నీరు నిలువ లేకుండా చూసుకోవాలని ప్రజలకు తెలియచేశారు. కణితిలో ఓపీ చూస్తున్న ఏ.ఎన్.ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైడే-ఫ్రైడే కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, ఏఎనఎంలు పాల్గొన్నారు. తదుపరి పెద గంట్యాడ ప్రాథóŠమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఓపీ సేవలు పరిశీలించారు. ఓపీ సేవలు ఇంకా పెంచాలని అక్కడ ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్ గైర్హాజరు పై అసహనం వ్యక్తం చేశారు. ఈహెచఆర్, అభ ఐడీ రిజిస్ట్రేషన్, ఐవీఆరఎస్తో హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట పబ్లిక్ పెర్సప్షన్, కేపీఐ ఇండికేటర్స్, ఆర్బీఎస్కే సేవలు, ఓపీ, ఐపీ సేవలు, ల్యాబ్ టెస్ట్లు, మందులు లభ్యత, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు వంటి విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈసందర్శనలో ప్రాథóŠమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు .స్వరూప, అసిస్టెంట్ మలేరియా అధికారి బి. నాగభూషణ రావు, కణితి ఎంపీహెచఈవో, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.