హెల్మెట్ ధరించని 4972 మంది డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్
అక్షర కిరణం, (విశాఖపట్నం): హెల్మెట్ ధరించ కుండా ద్విచక్రవాహనం నడిపి 4,972 మంది డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలలపాటు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు. ఈనెల 2 నుంచి 11 వరకు 5543 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని వారిలో 4,972 మంది డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్టు డీటీసీ పేర్కొన్నారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే ఎంవీ యాక్ట్ 207 ప్రకారం ఆ వాహనాన్ని సీజ్ చేస్తామని డీటీసీ రాజారత్నం స్పష్టం చేశారు.