బర్మాక్యాంప్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కారం
అక్షర కిరణం, (మాధవధార): జీవీఎంసీ 49వవార్డు బర్మాక్యాంప్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోరు పని చేయక నీరు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్నొన్నారు. అప్పటి నుంచి పాఠశాలలో నీటి ఎద్దడి కొనసాగుతోంది. సమీప ప్రాంతాల్లో నీటిని సేకరించి విద్యార్థుకు అవసరాలు తీర్చుకునేవారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయిని వసంత కుమారి జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్‌కు దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాల ప్రాంగణంలో నూతన బొర్, మున్సిపల్ కొళాయి ఏర్పాటు చేయాలని వినతి అందజేశారు. జీవీఎంసీ కమిషనర్ వెంటనే స్పందించి నార్త్ జోన్ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము పర్యవేక్షణలో బోరు తవ్వించి మోటారును అమర్చి విద్యార్థులకు తాగు నీరు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో చర్చించి మంచినీటి కుళాయి కనెక్షన్‌ను కూడా సమాకూర్చినట్టు హెచఎం వసంత కుమారి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో ప్రవేశాలు పెరిగి విద్యార్థుల సంఖ్య 285కి చేరిందని తెలిపారు. కాగా శనివారం పాఠశాలలో మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశం ఉండడంతో విద్యార్థులకు తాగునీరు అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించిన జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్‌కు, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, మంచి నీటి విభాగం ఏఈ సుమన్‌కు, వర్క్ ఇన్స్పెక్టర్ సీపాన సన్యాసి అప్పారావు, ప్రసాద్, ఈశ్వర్ రావుకు హెచఎం కృతజ్ఞతలు తెలిపారు.