ఏపీలో సర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జాబితాలో పేరు చెక్ చేసుకోండిలా..
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్/ సర్) ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ వివ రాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్ యా దవ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఎసఐఆర్ ప్రక్రి యలో భాగంగా 3.71 కోట్ల మంది తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు వివేక్ యాదవ్ తెలిపారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 89.22 శాతం మంది ఎన్యుమ రేషన్ ఫారాలు సమర్పించినట్లు తెలిపారు. ఓటరు జాబితా లోని 15.22 లక్షల మందిని మృతులుగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 22.30 లక్షల మంది ఓటర్లు ఎసఐఆర్ ప్రక్రియకు గైర్హాజరు కావడమో.. శాశ్వతంగా నివాసాలు మారడమో జరిగినట్లు తెలిపారు. అలాగే 7.37 లక్షల మంది రెండు, మూడు చోట్ల ఓటర్లుగా నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
మరోవైపు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు ఉన్న వారి పేరును ఒకేచోట కొనసాగించామని వివేక్ యాదవ్ తెలిపారు. ఫారం-6తో నిజమైన ఓటర్లు మరోసారి నమోదు చేసుకునే వీలుందని వెల్లడించారు. ముసాయిదా ఓటరు జాబితాపై నేటి నుంచి (జులై 31) ఆగస్ట్ 30వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. వీటిని పరిశీలిం చిన అనంతరం.. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రకటిం చనున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వివ రించారు. మరోవైపు నోటీసు, విచారణ లేకుండా ఓటర్ జాబితాలో నుంచి ఎవరి పేరును కూడా తొలగించబోమని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఇక్కడ క్లిక్ చేసి.. ఎసఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో.. చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీ జిల్లాను. నియోజకవర్గాన్ని, అలాగే ఇంగ్లీష్, తెలుగు భాషలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసిన అనంతరం.. కింద ఇచ్చిన కాప్చా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ పోలింగ్ బూత్ నంబర్ నమోదు చేసి ఎసఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందులో మీ పేరు ఉందో, లేదో తెలుసుకునే అవకాశం ఉంది.