డ్రగ్స్ కేసులో వైద్యుడు అరెస్టు
అక్షర కిరణం, (విశాఖపట్నం): కూర్మాన్నపాలెంలో ప్రముఖ ఆసుపత్రి వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వైద్య విద్యార్థులు, డాక్టర్లను టార్గెట్‌గా చేసి విశాఖలో కోకైన్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఢల్లీి కేంద్రంగా నడుస్తున్న ఈ మత్తుపదార్థాల ముఠాను విశాఖ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ కేసులో విశాఖ పోలీసులు డాక్టర్ కృష్ణచైతన్య వర్మను అరెస్టు చేశారు. కూర్మన్నపాలెంలోని ఏ ప్లస్ ఆసుపత్రి సీఈవో అయిన తనకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. కొకైన్కు రూ.60 వేలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ కాగా, మరికొందరి పాత్రపై విచారణ కొనసాగుతోంది.