పొత్తుల్లో విభేదాలు సహజమే
îపవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు నాయుడు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో.. ముఖ్యంగా పార్టీల పొత్తుల్లో ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు, మనస్పర్థలు రావడం సహజమైన విషయమని, కానీ తమ మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్రను అభినందిస్తూ సీఎం చంద్రబాబు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ సంపదలో 50 శాతానికి పైగా మహిళల పేరుతో ఉండే రోజును చూడాలని తాను కోరుకుంటున్నానని, ప్రారంభంలో వ్యతిరేకత ఎదురైనప్ప టికీ, విద్య, ఉద్యోగాలలో మహిళ లకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఏపీ సీఎం గుర్తు చేసుకున్నారు.
ఏపీ అధికార కూటమి (టీడీసీ, జనసేన, బీజేపీ) మధ్య విభేదాలు ఉన్నాయంటూ అప్పుడప్పుడూ వచ్చే ఊహగానాల కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెక్ పెట్టారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయన అత్యంత సానుకూల వ్యాఖ్యలు చేశారు. రాజకీయా ల్లో.. ముఖ్యంగా పార్టీల పొత్తుల్లో ఉన్నప్పుడు భిన్నాభిప్రా యాలు రావడం అత్యంత సహజమైన విషయమని, కానీ తమ మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్రను అభినందిస్తూ సీఎం చంద్రబాబు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సమకాలీన రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ తీరుపై సీఎం మాట్లా డుతూ.. పవన్ కళ్యాణ్ విశ్వసనీయత గల లీడర్ అని అన్నారు. తమ మూడు పార్టీలు కలిసి... తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నా యని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ మూడు పార్టీల మధ్య అద్భుతమైన అవగాహన ఉందని, రాష్ట్ర అభి వృద్ధి కోసం కలిసికట్టుగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. చాలా మంచి భాగస్వామ్యంలో ముందుకు సాగుతున్నామని చంద్రబాబునాయుడు చెప్పారు.
మహిళల ఆర్థిక, రాజకీయ సాధికారతపై
అదేవిధంగా ప్రపంచ సంపదలో 50 శాతానికిపైగా మహిళ ల పేరుతో ఉండే రోజును చూడాలని తాను కోరు కుంటు న్నానని, ప్రారంభంలో వ్యతిరేకత ఎదురైనప్పటికీ, విద్య, ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉందని, ప్రపంచ సంపదలో అధిక భాగం మహిళల పేరిట ఉండటమే తన అంతిమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
కాగా కూటమి పార్టీల మధ్య తరచూ సయోధ్య లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, స్వయంగా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఎం చేసిన ఈ స్పష్టమైన ప్రకటనతో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు మరింత బ్యాలెన్స్‌తో పనిచేసేందుకు ఈ వ్యాఖ్యలు బూస్ట్‌లా ఉపయోగపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.