పీవీ సురేష్‌పై రౌడీషీట్ అక్రమం అంటూ ధర్నా
అక్షర కిరణం, (మాధవధార): విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్‌పై అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారంటూ వైసీపీ నాయ కులు విమర్శించారు. మంగళవారం విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రులు, విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షు రాలు వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, సమన్వయకర్తలు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పార్టీ రాష్ట్ర, పార్లమెంట్, సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.