జీవో నంబర్ 115 రద్దు చేయాలంటూ కాంట్రాక్టు నర్సుల ధర్నా
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు ఏరియా ఆస్పత్రి వద్ద కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది ధర్నా చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న నర్సులు గురువారం ధర్నా నిర్వహించారు. తమకు నష్టం కలిగించే జీవో నంబర్115ను రద్దు చేసి నోటిఫికేషన్‌తో స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు నర్సింగ్ల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 115జీవోను వెంటనే రద్దుచేయాలన్నారు. మూడున్నరేళ్లు జీఎన్ఎం కోర్సు, నాలుగేళ్లు బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చదివి కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ సమయంలో ఎంతోమంది స్టాఫ్‌నర్సులు సేవలు అందించి చనిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు తమను కాదని ఇటీవల శిక్షణపొందిన వారికి ఏఎన్ఎంలను, స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు జీవో ఇవ్వడం అన్యాయమన్నారు. చిన్న చదువులు చదివిన వారికి పెద్ద ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనాసరే తమ బాధను అర్థంచేసుకుని కాంట్రాక్టు నర్సింగ్ ఉద్యోగులను రైగ్యూలైజేషన్, చేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సాలూరు ఏరియా ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.