అన్నపూర్ణ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం
అక్షర కిరణం, (మాధవధార): మాధవ దార సీతన్న గార్డెన్స్‌లో కోలువైయున్న శ్రీ కనకమహాలక్ష్మి గాయత్రీ దేవి కనకదుర్గాదేవి సహిత అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. ఈసందర్భంగా ఆలయ ధర్మకర్త సనపల కీర్తి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్ ఆ పరమశివుడికి బిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణ దేవి అని అన్నారు. తమ ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణదేవి గా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించడం ఎంతో ఆనందకరంగా ఉందని సనపల కీర్తి తెలిపారు. భక్తులు దుర్గమ్మని అన్నపూర్ణ దేవిగా చూసి తరించారు. తమ స్వహస్తాలతో పలువురు భక్తులు అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని భక్తిశ్రద్ధల తో దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.