మేడపై నుంచి పడి ఈటీవీ బ్యూరో చీఫ్ మృతి
చంద్రబాబు, రేవంత్, పవన్‌ల సంతాపం
అక్షర కిరణం, (హైదరాబాద్): ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ మేడపై నుంచి జారిపడి కన్నుమూశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన నారాయణ సుదీర్ఘ కాలంగా ఈటీవీలో పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. నారాయణ హఠాన్మరణంపై మిత్రులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం అపార్టుమెంట్‌పై వాకింగ్ చేస్తుండ గా ప్రమాదవశాత్తు జారిపడిటంతో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భవనంపై నుంచి పడిన వెంటనే సమీపంలోనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. నారాయణకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 25 ఏళ్లుగా ఈటీవీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వస్తున్నారు.
నారాయణ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు సన్నిహితులు వివరించారు. కొద్ది నెలల కిందట బోన్‌మారో కాన్సర్ బారిన పడ్డారు. ఈక్రమంలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో మెరుగైన వైద్య చికిత్సల తర్వాత ఆరోగ్యం కొంత కుదుట పడిరది. గతంలో సిఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య చికిత్సలు అందించారు. చికిత్స తర్వాత కోలుకుంటుండగా రెండోసారి క్యాన్సర్ తిరగబెట్టినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈక్రమంలో మెరుగైన వైద్య చికిత్స కోసం ఇటీవల ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎల్వోసీ కూడా మంజూరు చేసింది.
రెండు రోజుల కిందట కీమో చికిత్స అందించిన తర్వాత ఇంటి దగ్గరే నారాయణ విశ్రాంతి పొందుతున్నారు. ఉదయం మేడపై వాకింగ్ చేయడానికి మేడపైకి వెళ్లిన సమయంలో కాలు జారి పడిపోయారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించేలోపు కన్ను మూశారు. నారయణ మృతిపై సహచరులు, జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు విచారం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సంతాపం
సీనియర్ జర్నలిస్ట్ నారాయణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. నారాయణ నిజాయితీపరుడైన జర్నలిస్ట్ అని కొనియాడారు. ఆయన మృతి కలిచి వేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా నారా యణ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమ న్నారు. వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. నారాయణ మరణం బాధాకర మని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.