ఢల్లీి పేలుడు.. కీలకంగా వ్యవహరించిన టెలిగ్రామ్!
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): దేశ రాజధాని ఢల్లీిలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవిం చింది. ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితుడు ఫోటోను కూడా విడుదల చేశారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పేలుడుకు కుట్ర జరిగినట్టు భావిస్తున్నారు.
ఢల్లీి పేలుడులో కీలకంగా టెలిగ్రామ్ యాప్
ఢల్లీి పేలుడులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్, టెలిగ్రామ్ యాప్‌లో సమన్వయం చేసుకునే ఒక తీవ్రవాద డాక్టర్ల గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఉమర్‌కు పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా జైషే ఉగ్ర మాడ్యూల్లో కీలక పాత్రధారులుగా భావిస్తున్న మరో ఇద్దరు డాక్టర్లు అరెస్టవడం తో భయాందోళనకు గురై, ఆత్మాహుతి పేలుడు జరిపినట్లు నిఘా వర్గాలు వెల్లడిరచాయి. అయితే, మొత్తం కుట్ర అంతా టెలిగ్రామ్ యాప్‌తో అమలు చేసినట్టు అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లకు టెలిగ్రామ్ ఒక సాధారణ, భద్రత కలిగిన సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్‌లా కనిపిస్తుంది. కానీ, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే ప్లాట్‌ఫారంగా తనను పరిచయం చేసు కుంటున్న ఎన్క్రిప్టెడ్ యాప్, వాస్తవానికి ఉగ్రవాద కార్యకలా పాలు, నేరచర్యలు, తప్పుడు సమాచార వ్యాప్తి, చిన్నారులపై లైంగిక దుర్వినియోగ కంటెంట్, జాతివివక్షతకు కేంద్ర బిందువుగా మారుతోందని నివేదికలు చెబుతున్నాయి.
అల్ ఫతాప్‌ా వర్సిటీలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్
ఢల్లీి పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఫరీదాబాద్‌లోని అల్ ఫతాప్‌ా యూనివర్సిటీకి చెందిన మరో ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో సోమవారం ముగ్గురు వైద్యులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
పేలుడుతో జైషే మహ్మద్ మహిళా విభాగం హస్తం!
ఢల్లీిలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి నాయకత్వం వహిస్తోన్న జమాత్ ఉల్ మొమినాత్తో సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్నోకుచెందిన లేడీ డాక్టర్ షహీనా షాహిద్ భారత్‌లో దానికి చీఫ్‌గా ఉన్నట్టు గుర్తించారు. ఉగ్రదాడులకు ఆమె సహకారం అందిస్తున్నట్టు తెలిసింది.