శ్రీ రామ అవతారంలో జగన్నాథ స్వామి దర్శనం
అక్షర కిరణం, (విశాఖపట్నం): టర్నర్ సత్రంలో జరు గుతున్న శ్రీజగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల లో భాగంగా గురువారం జగన్నాథ స్వామి శ్రీరాముని అవ తారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామి దేవ స్థానం, రామతీర్థం సహాయ కమిషనర్, ఈఓ వై.శ్రీనివాస రావు దంపతులు రామతీర్థం దేవస్థానం నుంచి స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వారికి ప్రధాన ఉత్సవ అధికారి టి అన్నపూర్ణ, ఈఓ టి రాజగోపాల్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఎస్.రాజ్‌కుమార్, సభ్యులు, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాల ను అందజేశారు. మధ్యాహ్నం 1000 భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.