బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్, మహిళా ఉపాధ్యక్షురాలుగా మంజుల
అక్షర కిరణం, (విశాఖపట్నం): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా చల్లా మంజులను నియమిస్తూ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం గుర్తించి వీరిని నియమించామని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నియామక ఉత్తర్వులలో పరశురామరాజు పే ర్కొన్నారు. ఈసందర్భంగా దాడి రమేష్, చల్లా మంజుల మాట్లాడుతూ ప్రధాని మోడీ పరిపాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో, విశాఖపట్నం జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. తమకు పదవులు దక్కడానికి కృషి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఉత్తర ని యోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా పార్టీ అధ్య క్షుడు పరశురామరాజుకు , పార్టీలోని పెద్దలకు అనుబంధ సంఘాల నాయకులకు, వివిధ క్షేత్రాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.