ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లపై డీపీసీ షెడ్యూల్ విడుదల
అక్షరకిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కొత్తగా డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) షెడ్యూలును విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎసఎస్ రావత్ డీపీసీల సవరించిన పూర్తి షెడ్యూల్‌తోపాటు మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేశా రు. 2026-27 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో ఈ-డీపీసీ నిర్వహణకు అవసరమైన మార్పులతో సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. డిపార్ట్ మెంట్ హెడ్లు ఈ ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని సూచిం చారు. ఈనెల 30లోపు ప్రాథమిక అంచనా ఖాళీలు, సీనియారిటీ జాబితా సమీక్షను పూర్తి చేయాలి. ఒకవేళ డీపీసీ నిర్వహించాల్సిన అవసరం లేకపోతే కనుక ఆ విషయాన్ని పేర్కొనాలని సూచించారు. ఈ ప్రమోషన్ల పరి శీలన పరిధిలోకి వచ్చే అధికారుల సమాచారాన్ని కూడా సేకరించాలి. అక్టోబరు 7లోగా ఐదేళ్ల ఎసఆర్ నివేదికలు, ఆరోపణ పత్రాలు, సస్పెన్షన్లు, ఏసీబీ, క్రిమినల్ కేసులు, కోర్టు ఉత్తర్వులకు సంబంధించిన వివరాలను సేకరిం చాలి. అక్టోబరు 14లోపు తాత్కాలిక డీపీసీ నోట్ తయారు చేసేందుకు.. సేకరించిన సమాచారం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అధికారుల జాబితాను సిద్ధం చేయాలి.
అక్టోబరు 21లోపు తుది ఖాళీల అంచనాను ఖరారు చేసి, తుది డీపీసీ నోట్‌ను సంబంధిత సచివాలయ శాఖకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 15, 30, డిసెంబరు 15లోపు డీపీసీ సమావేశాలను గెజిటెడ్ స్థాయి అధికారిని అనుసరించి పూర్తి చేయాలి. ఈలోపు శాఖాధిపతుల నుంచి సచివాలయంలోని శాఖకు, సచి వాలయం నుంచి జీఏడీ (సర్వీసెస్)కి వివరాలు సమర్పిం చాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు ఏపీ కేడర్ అధికారికి కేంద్రంలో కీలక పదవి దక్కింది. 1998 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ నాగులాపల్లి కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగం అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పెట్రోలియం మంత్రిత్వశాఖ లో హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయన్ను ఆర్థికశాఖ వ్యయ విభాగానికి బదిలీచేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది.