డీటీసీ రాజారత్నంకు బదిలీ.. విశాఖపట్నం డీటీసీగా ఆదినారాయణ బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (మాధవధార): డీటీసీ డాక్టర్ జీసీ రాజరత్నంకు బదిలీ అయ్యింది. రాజరత్నం విశాఖపట్నం నుంచి విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో డీటీసీ అడ్మిన్‌గా బదిలీకావడంతో జి ఆదినారాయణ విశా ఖపట్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ)గా నియ మితులయ్యారు. ఆదినారాయణ మంగళవారం విశాఖ పట్నంలోని ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ స్కూల్, బస్సులు ఆటోలు రోడ్డు భద్రత నియమా లను పాటించాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. లేకుంటే వారి లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలందరూ ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని సూచించారు.
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలపై అవగా హన పెంపొందించుకోవాలని భద్రతా నియమాలను ఖచ్చి తంగా పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో సహకరించాలన్నారు.