ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా డి.శ్రీరామచంద్రమూర్తి బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (మాధవధార): ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా డి.శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బిర్లా జంక్షన్ మాధవధరలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబ్బంది పుష్ప గుచ్చాలతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ ప్రకారం పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ప్రైవేట్ మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైన అనంతరం నిబంధన మేరకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా మద్యం అక్రమ రవాణా,గంజాయి , డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు తమ పరిధిలో పాఠశాలలో పాటుగా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు.