తీరం దాటిన మొంథా తుఫాన్
కబలహీన పడుతున్న మొంథా
కపలు జిల్లాల్లో భారీ వర్షాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం/అమరావతి): బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో మొంథా తుపాను తీరాన్ని తాకింది. అనంతరం బలమైన తుపానుగా కొనసాగుతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. తుపాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుపాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
మొంథా తుపాను నేపథ్యంలో.. రాబోయే 24 గంటల్లో ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 పట్టణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో 2194 రిలీఫ్ క్యాంపులను అధికారులు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతోపాటు.. ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు సైతం ప్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు.
బలహీనపడిన మొంథా తుఫాన్
‘మొంథా’ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడిరది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీరం దాటిన మొంథా తుఫాన్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
మొంథా తీవ్రతుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 6గంటల్లో తుపానుగా బలహీనపడనుందని వెల్లడిరచింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయి.
రాబోయే 12 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలులు.. వాతావరణ శాఖ అంచనా వేసింది.
మచిలీపట్నం - దివిసీమ - కృష్ణా - పశ్చిమ గోదావరి - కోనసీమ - బాపట్ల బెల్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవశాకం ఉందని పేర్కొంది. విజయవాడ - గుంటూరు - అమరావతి ప్రాంతంలో భారీ వర్షాలు, 90 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆ శాఖ పేర్కొంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 80-90 కి.మీ. వేగంతో గాలులు రాజమండ్రి - కాకినాడ - అమలాపురం - ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, విశాఖ పట్నం, శ్రీకాకుళం - విజయనగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటాయని వాతావరణ శాఖ ఈసందర్భంగా పేర్కొంది.