వైఎస్ జగన్‌కు రిలీఫ్
సీబీఐ పిటీషన్‌ను
కొట్టేసిన సీబీఐ కోర్టు
అక్షర కిరణం, (హైదరాబాద్): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వైఎస్ జగన్ లండన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కూతురిని చూసేందుకు వైఎస్ జగన్ అక్టోబర్ 11వ తేదీ లండన్ వెళ్లారు. అయితే వైఎస్ జగన్ లండన్ పర్యటనలో బెయిల్ షరతులను ఉల్లంఘించారని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ తన సొంత నంబర్ కాకుండా.. వేరే ఫోన్ నంబర్ ఇచ్చారని.. ఆ నంబర్‌కు ఫోన్ చేసినా పనిచేయలేదని పిటిషన్లో పేర్కొంది. వైఎస్ జగన్ ఉద్దేశపూర్వకంగా పనిచేయని ఫోన్ నంబర్ ఇచ్చారంటూ సీబీఐ పిటిషన్ వేయగా.. ఈ పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్ ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్‌లో ఉన్న పెద్ద కుమార్తెను చూసేందుకు వైఎస్ జగన్ అక్టోబర్ 11వ తేదీన లండన్ పర్యటనకు వెళ్లారు. అయితే వైఎస్ జగన్ లండన్ పర్యటన సందర్భంగా బెయిల్ కండీషన్లను ఉల్లంఘించారని సీబీఐ పిటిషన్ వేసింది. వైఎస్ జగన్ తన సొంత ఫోన్ నంబర్‌ను వెల్లడిరచలేదని కోర్టులో పిటిషన్ చేసింది. వైఎస్ జగన్ లండన్‌లో ఉన్న సమయంలో మూడు సార్లు నంబర్‌కు ఫోన్ చేసినా.. ఆ నంబర్ పని చేయలేదని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. జగన్ ఉద్దేశపూర్వకంగానే ఇలా పనిచేయని ఫోన్ నంబర్ ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్ వేసింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మరోసారి వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది.
సీబీఐ వేసిన పిటిషన్ మీద నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వైఎస్ జగన్ అసలు ఫోన్ వాడరని తెలిపిన న్యాయవాదులు.. గతంలోనూ జగన్ తన సిబ్బంది ఫోన్ నంబర్లే ఇచ్చారని వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు అక్టోబర్ 22వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సీబీఐ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పును విచారించింది.