పలాసలో దొంగల స్వైరవిహారం
కనాలుగు దుకాణాల్లో చోరీ
కఒక షాపులో చోరీకి యత్నం
అక్షరకిరణం, (పలాస): పలాసలో దొంగలు కలకలం సృష్టించారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి చోరీలు చోటుచేసుకున్నాయి. ఏకంగా నాలుగు షాపులను కొల్లగొట్టి గ్రామంలో భయాందోళనలు కలిగించారు. ఒక దుకాణం తాళాలు పగలుగొట్టేందుకు విఫలయత్నం చేశారు. శ్రీనివాస లాడ్జి కూడలిలో రెండు మెడికల్ షాపులను దుండగులు కొల్లగొట్టారు. తంగుడు సాంబమూర్తి మెడికల్ షాప్ తాళాలు పగలగొట్టి 3,65,000 నగదు అపహరించారు. రామకృష్ణ మెడికల్ షాపులో రూ.40,000 చోరీ చేశారు. కాశీబుగ్గ పెట్రోల్ బంక్ సమీపంలో మారో రెండు షాపులలో చోరీకి పాల్పడ్డారు.
లక్ష్మి మెడికల్ స్టోర్ తాళాలను దొంగలు పగలగొట్టారు. ఇంటర్నెట్, ట్రావెల్స్ షాపులో రూ.6,000 నగదు చోరీ చేశారు. దీంతో ఆయా దుకాణాల యజమానులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాలలో కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.