53వ వార్డులో పునరావాస కేంద్రాల పరిశీలన
అక్షర కిరణం (మర్రిపాలెం): జోన్ 5 పరిధిలో 53 వార్డులోని పునరావాస కేంద్రాలను మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి వెంకట నర్స కుమారి మంగళవారం పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు