కౌన్సిల్ సమావేశంలో 13వ వార్డులో సమస్యలపై కార్పొరేటర్ సునీత చర్చ
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 13వ వార్డులోని సమస్యలపై కార్పొరేటర్ సునీత చర్చించారు. వీధిదీపాలు సరిగ్గా వెలగక పోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, శివాజీ నగర్ -2 (40 గజాలు) దగ్గర గల ప్రధాన గడ్డ రక్షణ గోడ నిర్మాణానికి, కుక్కల బెడద ఎక్కువగా ఉన్న కారణంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలని 13వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత విజ్ఞప్తి చేశారు. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ (శ్రీకాంత్ నగర్) వెనక రిటర్నింగ్ వాల్ దీపాలు వెలగడం లేదని తెలిపారు. దారపాలెం సింహాద్రి లేఔట్ అల్లూరి సీతారామరాజు లేఔట్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. వార్డులో ఉన్న కమ్యూనిటీ హాల్లోను సచివాలయానికి ఇవ్వడం వలన ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు శుభకార్యం చేసుకోవడానికి, డ్వాక్రా మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కమిటీ హాల్లో అదనపు అంతస్థులు ఏర్పాటు చేయాలన్నారు. ఆరిలోవ కాలనీ లాస్ట్ బస్టాప్ దగ్గర గల జీవీఎంసీ కళ్యాణ మండపం ఆధునికరణ చేపట్టాలని అధికారులను కోరారు.