జీవీఎంసీలో 10 మంది స్థాయి సంఘం సభ్యుల ఎన్నిక
కఫలితాలు వెల్లడిరచిన కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో 10 మంది సభ్యులు ఎన్నికైనట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. తదుపరి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటించారు. ఈ స్థాయి సంఘం ఎన్నికల్లో 20 మంది సభ్యులు పోటీలో పాల్గొనగా ,92 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ పోటీలలో 10 మంది స్థాయి సంఘం సభ్యులుగా ఎన్నికైనట్లు కమిషనర్ తెలిపారు. నీలిమ కొణతాల 58 ఓట్లు, గంకల కవిత 57 ఓట్లు, దాడి వెంకట రామేశ్వరరావు 57 ఓట్లు, మొల్లి హేమలత 57 ఓట్లు, సేనాపతి వసంత 54 ఓట్లు, గేదెల (బంటుబిల్లి) లావణ్య 53 ఓట్లు, మాదంశెట్టి చినతల్లి 52 ఓట్లు, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు 52 ఓట్లు , మొల్లి ముత్యాలు 51 ఓట్లు, సాడి పద్మావతి (పద్మా రెడ్డి)లకు 50 ఓట్లు పోలైనట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికలు ఫలితాలను వెల్లడిరచి ఎన్నికల్లో గెలుపొందిన వారికి కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికైన సభ్యులకు ఎన్నికల్లో గెలు పొందినట్లుగా ధ్రువీకరణ పత్రాలను జీవీఎంసీ కార్యదర్శి బీవీ .రమణ అందించి శుభాకాంక్షలు తెలిపారు.