పదో వార్డులో సామాజిక భవనం ప్రారంభం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): జీవీఎంసీ పదో వార్డులో సామాజిక భవనాన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎంపీ ఎం.శ్రీభరత్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని వందరోజుల పాలనలో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించామని తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి మాట్లా డుతూ గత వైసీపీ ప్రభుత్వం హాయంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పదో వార్డు కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి సన్యాసిరావు, బుడుమూరు గోవిందు, ముగడ రాజారావు, రాగాతి అచ్యుతరావు, ఒమ్మి అప్పలరాజు, మామిడి మోహన్, మద్దిల రాజేష్ మహిళా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.