లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం పింఛన్లను పంపిణీ చేశారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీని పరిశీలించారు. దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. లబ్ధిదారుల కు అసౌకర్యం కలగకుండా వేళకు పింఛన్ అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కాగా అల్లినగరం పంచాయతీలో మొత్తం 315 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. అందులో వయోవృద్ధులు 112, వితంతువులు 76, అభయహస్తం 43, దివ్యాంగులు 36, చేనేత కార్మికులు 28, ఒంటరి మహి ళలు 9, డప్పు కళాకారులు 7, డయాలసిస్ బాధితులు 2, కల్లుగీత కార్మికుడు 1, ఆరోగ్య పింఛనుదారుడు ఒకరు ఉన్నారు. ఈకార్యక్రమంలో ఎచ్చెర్ల ఎంపీడీవో, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.