నిధులు వినియోగంలో నిర్లక్ష్యం చేయరాదు
Åకలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో కంపెనీల యాజమాన్య సిబ్బంది, అధికారుల తో నిధులు మంజూరు, నిధుల వినియోగంపై సమీక్ష సమా వేశం నిర్వహించారు. శాఖల వారీగా జిల్లాలో సీఎసఆర్, సీఈఆర్. గ్రాంట్లులో మంజూరు అయిన నిధులు, వాటి వినియోగ వివరాలు, పనులు పురోగతిని పరిశీ లించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తరగతి గదుల నిర్మాణం, ఆసుపత్రులు, ఆరోగ్య శిబిరాలు నిర్వహణ, వైద్య పరికరాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు మొక్కలు నాటుట, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పనుల గురించి ఆరా తీశారు. నిధులు వినియోగం సకాలంలో జరగాలని పనులు పూర్తి చేయాలని అదేశించారు. మొక్కల పెంపకం, చెరువులు, కుంటల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామాల్లో ప్రజలకు పారిశుద్ధ్య సదుపాయాల ఏర్పాటు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి విషయాలపై సూచనలు చేశారు. సమావేశానికి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ రమణ, సీపీవో ప్రసన్నలక్ష్మి, ఇండస్ట్రీయల్ జీఎం శ్రీధర్, మత్స్య శాఖ జేడీ సుమలత, సుడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్, వికలాంగుల సంక్షేమం శాఖ ఎండీ బి.దేవ రాజు, బ్యాంకు అధికారులు, కంపెనీల అధికారులు తదితరులు పాల్గొన్నారు.