రేసపువానిపాలెం ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): రేసపువానిపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న వైద్య ఆరోగ్య సేవలను ఈహెచ్ఆర్, అభ ఐడీ క్రియేషన్, మందుల పంపిణీ వాటి ఎక్ష్పైరీ తేదీలను పరిశీలించారు. ల్యాబ్ టెస్ట్లు, స్టోర్స్ తనిఖీ చేసి వైద్యాధికారికి పలు సూచ నలు చేశారు. ఓపీ ఏవిధంగా పెంచాలో సూచించారు. శత శాతం అభ ఐడీ క్రియేషన్ చేయడం గురించి వివరిం చారు. సిబ్బంది సమయపాలన పాటించా లని సూచించా రు. సిబ్బంది మందుల పంపిణీ నిమిత్తం ఏది అవసరం ఉందో, దానికి సంబంధించిన మందులను ముందుగా స్టోర్లో ఉంచుకోవాలని, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు క్షేత్ర సందర్శన చేసి వారు నిర్వర్తించవలసిన ఆరోగ్య కార్య క్రమాలన్ని ప్రజలకు అందేటట్లు తమ విధులను నిర్వహిం చాలని ఆదేశించారు. సందర్శనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, డాక్టర్ బి.ఉమావతి, డీపీఎంవో ఎన్హెచ్ఎం, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది, నాగభూషణం ఎంపీహెచ్ఈవో పాల్గొన్నారు.